BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:05 pm Posted by : BHARATH PRATHINIDHI

రైతులు సకాలంలో పంటల బీమా (ఈ-పంట) నమోదు చేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి ఎండి. ఫారుఖ్

​చెరుకుపల్లి, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : చెరుకుపల్లి మండలంలోని పొన్నపల్లి, నడింపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి Md. ఫారుఖ్ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వెద పద్ధతిలో సాగు చేసిన వరి పొలాలను అధికారులు పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. బెట్ట పరిస్థితులను తట్టుకునేందుకు పొటాషియం నైట్రేట్ (13:0:45) వంటి పోషకాలను పిచికారీ చేయాలని, సహజ వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు.

అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) నమోదుకు ఆగస్టు 31 ఆఖరి తేదీ కావడంతో రైతులందరూ తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని, రైతు సేవా కేంద్రాల్లో ఈ-పంట నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో రామకృష్ణ, వీఆర్వో శ్రావణ్ కుమార్, వీఏఏలు ఎంవీవీ ప్రసాద్, శివ సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.