BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 12:49 pm Posted by : BHARATH PRATHINIDHI

ప్రముఖ దర్శక రచయిత నటుడు కృష్ణశ్వరరావు మృతి

గుంటూరు, 11 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రముఖ నాటక దర్శక రచయిత, సినీనటుడు కృష్ణశ్వరరావు (71) గుంటూరుఏటీ అగ్రహారంలో తుదిశ్వాస విడిచారు. గడిచిన పదేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం మరణించారు “ఊరేగింపు” అనే సినిమా ద్వారా సినీరంగానికి పరిచయం అయ్యారు. విరూపాక్ష, నాంది, ఘోస్ట్, గోపి గోపిక గోదావరి ఇలా మొత్తం 40కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం గుంటూరు స్తంభాల గరువులోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి.