గుంటూరు అభివృద్ధికి మరో అడుగు బీ2 ఎక్స్పో
గుంటూరు, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో మూడు రోజులుగా జరిగిన బీ2 ఎక్స్పో–2026 చివరి రోజు ఆదివారం కార్యక్రమాలు వినూత్నంగా సాగాయి. వ్యాపార ప్రదర్శనలు, పారిశ్రామిక చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం ద్వారా బీ2 ఎక్స్పో నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 7, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ ఎక్స్పో చివరి రోజు కార్యక్రమం అధ్యక్షుడు కొమ్మమూరు శ్రీధర్ బాబు, కార్యదర్శి భీమవరపు హేమంత్ కుమార్, కన్వీనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ధృతి బి2 ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, హిందూ ఫార్మసీ కాలేజ్ చైర్మన్ జూపూడి రంగరాజు,గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఎక్స్‌పో ద్వారా గుంటూరులోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు తమ ఉత్పత్తులు, సేవలను పరిచయం చేసుకునేందుకు మంచి వేదిక లభించిందన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం యువతలో వ్యాపార ఆలోచనలను పెంచడం కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడం గుంటూరును మరింత ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యాల్లో భాగం. ఇలాంటి కార్యక్రమాలు రాబోవు రోజుల్లో మరిన్ని జరగాలని, గుంటూరులోని వ్యాపారవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువ ఎంటర్‌ప్రెన్యూర్లు మరింతగా ఎదగాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. వ్యాపారానికి వేదిక- సేవకు విలువ. మూడు రోజుల బీ2 ఎక్స్పో ముగింపు రోజున నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారం, పారిశ్రామిక అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నిర్వాహకులు చాటి చెప్పారు. వ్యాపార విజయాన్ని మాత్రమే కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన కూడా పారిశ్రామికవేత్తలు, యువతలో పెరగాలని ఈ కార్యక్రమం ద్వారా నిర్వాహకులు సందేశాన్ని అందించారు. శ్రీధర్ బాబు, హేమంత్ సారథ్యంలో ప్రారంభమైన బీ2 ఎక్స్పో చివరి రోజు కార్యక్రమంలో కన్వీనర్ రవిశంకర్, ఏవి రమణమూర్తి, వీరకుమార్, బద్రి, కోటేశ్వరరావు, బ్లూ క్రాస్ కుమార్, డాక్టర్ రమణ, అన్నంరాజు వంశీ ఇతర కమిటీ సభ్యులు, డాక్టర్ కాకాని పృథ్వీరాజు, డాక్టర్ విజయభాస్కర్,
సుందర్ రామశర్మ, బైరిశేట్టి మల్లికార్జునరావు, డాక్టర్ దీవి జయరాం,ఎల్చురి వెంకటేశ్వర్లు, ఆడిటర్ బ్రహ్మం మొదలైన వారు పాల్గొన్నారు.