రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్
ప్రతి ఒక్కరూ అపోహలు తొలగించుకుని జీవన్ ధాన్ పధకంలో నమోదు కావాలని పిలుపు

గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఒక వ్యక్తి మరణాంతరం అవయువ దానం చేయడం వల్ల మరో ఎనిమిది మందికి పునర్జన్మ ను ఇవ్వొచ్చు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అపోహలు తొలగించుకుని జీవన్ ధాన్ పధకంలో నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారతీయ విద్యా భవన్ లో బుధవారం అవయువ దానంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, డాక్టర్ రామారావు, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అవయువ దానం పై అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు.

ప్రస్తుతం ఆవయువాల కోసం 8 వేల మంది ఎదురు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అవయువ దానం చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. అవయువ దానం చేసిన వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా అవయువ దానం చేసిన వారి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పద్ధతిన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆర్ధికంగా అండగా ఉండే విధంగా కృషి చేస్తామని తెలిపారు.