BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:30 pm Posted by : BHARATH PRATHINIDHI

విద్య తోనే విద్యార్థుల భవిష్యత్తు

ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు

గుంటూరు, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నాయీబ్రాహ్మణ విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రతిబా పురస్కారాల సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ ఎన్ని చర స్థిరాస్తులు ఉన్న నాయీ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు విద్య ద్వారానే భవిష్యత్తు ఉండగలదని, ఎవరు పంచుకోలేనిది విద్య ఒక్కటేనని ప్రతి ఒక్కరూ పిల్లలను ఉన్నత స్థాయి వరకు చదివించాలని అప్పుడు మాత్రమే అసమానతలు తొలగుతాయని, అన్ని రంగాలలో పట్టు సాధించాలంటే ఒక విద్యతోనే సాధ్యమని తాటికొండ నరసింహారావు ఉద్బోధించారు. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో కీ”లు తెంపల్లి నారాయణరావు లక్ష్మీ వారి జ్ఞాపకార్థం టి శివ సుబ్రహ్మణ్యేశ్వర రావు లక్ష్మీ వారి సౌజన్యంతో 20 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ప్రతిభా పురస్కారాలు పెద్దల చేతుల మీదగా అందించటమైనది. రిటైర్డ్ ఏ ఇ,నాయీబ్రాహ్మణ జేఏసీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తెంపల్లి దుర్గారావు అధ్యక్షతనజరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఉ డా రిటైర్డ్ ఉద్యోగి జి ఉమామహేశ్వరరావు పత్తూరి శ్రీనివాసరావు టి రాఘవేంద్రరావు తాటికొండ శివాజీ పాల్గొని ప్రసంగించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు కే పూర్ణచంద్రరావు, టి అంకమ్మరావు, ఏ ఉమామహేశ్వరరావు, టి హరిబాబు, మున్నంగి శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.