BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 2:08 pm Posted by : BHARATH PRATHINIDHI

అమలాపురంలో డీఎస్పీ కార్యాలయం ప్రారంభం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా బ్యూరో, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఐపీఎస్ ప్రారంభించారు. ముందుగా డీఐజీకి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయెల్, పేరాబత్తుల రాజశేఖరం, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అల్లాడ శరత్‌బాబు, పెచ్చెట్టి చంద్రమౌళి, ఆర్డీఎస్ ప్రసాద్, కంచిపల్లి అబ్బులు, బోణం సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్, అదనపు ఎస్పీ మహేంద్ర మత్తే, అమలాపురం ఎస్‌డీపీఓ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, అమలాపురం టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పి. వీరబాబు, ఎస్సైలు, పంచాయతీరాజ్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. నూతన డీఎస్పీ కార్యాలయం అందుబాటులోకి రావడంతో అమలాపురం సబ్‌ డివిజన్ పరిధిలో పోలీసు పరిపాలన, శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు.