స్వచ్ఛందంగా నేత్రదానానికి అంగీకరించిన డిఎంహెచ్వో కె. విజయలక్ష్మి
గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కె. విజయలక్ష్మి నేత్రదానం చేసేందుకు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రజలకు నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను వివరించి, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రజల్లో చైతన్యం...