BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 2:47 pm Posted by : BHARATH PRATHINIDHI

శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌లు పంపిణీ

వినుకొండ, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యుల పిల్లలకు విద్యా ప్రోత్సాహకంగా స్కాలర్‌షిప్‌ల పంపిణీ  కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మేనేజర్ ఫణి, టి‌డి‌పి నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.