జిజిహెచ్ లో మోకీలు మార్పిడి ఆపరేషన్లకు ‘ఉన్నతి’ ద్వారా కోటి రూపాయలు

గుంటూరు, 12 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు సర్వజన ఆసుపత్రిలో నిరుపేదలకు ఉచితంగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేందుకు కోటి రూపాయల విలువైన ఇంప్లాంట్లు అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ జి దుర్గాప్రసాద్ తో డాక్టర్ నరేంద్ర రెడ్డి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దశాబ్దం క్రితం జిజిహెచ్ లో ఉచిత మోకీలు...