సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మల్యాద్రి
గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నగర సమితి ఆధ్వర్యంలో పాదయాత్రలను ఆరవ రోజైన మంగళవారం ఈరోజు సాయంత్రం చుట్టుగుంట హనుమాన్ నగర్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కోట మాల్యాద్రి ప్రారంభించారు. సిపిఐ నగర కమిటీ సభ్యులు కామ్రేడ్.బి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు. కామ్రేడ్ కోట మాల్యాద్రి మాట్లాడుతూ.. సమ సమాజ స్థాపన లక్ష్యంగా దేశవ్యాప్తంగా మార్పు కోసం పోరాటాలను విస్కృతంగా చేయబోతున్నామని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు అయినా ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోగా ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. అధికారంలో రాకముందు నోటికొచ్చిన హామీలిచ్చి.. గద్దెనెక్కిన తర్వాత ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. ప్రజాస్వామిక విధానాలు అమలు చేయడంలో మార్పు రావాలన్నారు. అన్ని రంగాల్లో దేశం వెనకడుగు ఉందని, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ మేడ హనుమంతరావు మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం, మతోన్మాదాన్ని వ్యతిరేకించడంలోను, రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలోనూ మార్పు రావాలన్నారు. ఎన్నికల విధానంలో, ఆర్థిక విధానాల అమలులో, ధరల పెరుగుదల అరికట్టడంలో, కష్టించి పనిచేసే శ్రమ జీవుల జీవితాల్లో మార్పు రావాలని ఇవన్నీ జరగాలంటే 12 ఏళ్లుగా ఢిల్లీ గద్దెపై కూర్చొని నియంతృత్వ విధానాలు అమలు చేస్తున్న బిజెపి అధికారం నుంచి మార్చి వేయాలని పేర్కొన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఐదు లక్షల చిన్న, పెద్ద పరిశ్రమలు మూతబడి ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి పరిస్థితి ఉత్పన్నం అవుతూ ఉందని అన్నారు. దేశంలో సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశమందుతున్నాయని, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ విజృంభించి ప్రజలను దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుగుంట హనుమాన్ నగర్1,2,3,4 లైన్లలో 70 సంవత్సరాల గా నివసిస్తున్న ప్రజల ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, ఏటి అగ్రహారం 11,12 లైన్లో, హనుమాన్ నగర్ రెండో లైన్ లో కరెంటు కోతలతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని విద్యుత్ అధికారులపై మండిపడ్డారు. తక్షణమే విద్యుత్ అధికారులు కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీన నగరంలోని గాంధీ పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు శ్రేయోభిలాషులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి కామ్రేడ్ రావుల అంజి బాబు, నగర కమిటీ సభ్యులు నూతలపాటి వెంకటేశ్వరరావు, మంగా శ్రీనివాసరావు, నగర సమితి సభ్యులు ఆకిటి రామచంద్రుడు, రెడ్డయ్య (చిన్న) షేక్ బాషా, రఘు,సిద్దూ, కాశీ రత్నకుమారి, జానకి, తదితరులు పాల్గొన్నారు.