నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీట్లకు కౌన్సిలింగ్
గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నేర నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు నల్లపాడు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అవాంఛనీయ పరిస్థితులకు, నేరాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లను హెచ్చరించారు. రౌడీ షీటర్లు తన నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని నల్లపాడు పోలీసులు ర్రౌడీషిటర్లకు సూచించారు.