ఏపీఐడీసీ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ
పారిశ్రామిక ప్రగతిపై పాలకవర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ ఛైర్మన్ డేగల ప్రభాకర్ అధ్యక్షతన కీలక అంశాలపై సమీక్ష గుంటూరు, 27 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ) కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం, కార్పొరేషన్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, పారిశ్రామిక రంగానికి మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టడంపై నేడు తాడేపల్లిలోని ఏపీఐడీసీ కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్...