వారం రోజుల్లో వీధి దీపాల ఫిర్యాదులను పరిష్కరించాలి
జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 26 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదునూ రాబోయే వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో వీధి దీపాల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై ఇంజినీరింగ్ విభాగ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత, కాల్ సెంటర్ మరియు గ్రీవెన్స్ ద్వారా వీధి దీపాలపై...