గుంటూరు ఉప రవాణా కమిషనర్ కె.సీతారామి రెడ్డి
గుంటూరు, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జిల్లాలో 282 వాహనాలపై అపరాధ రుసుము వసూలు చేయడం జరిగిందని ఉప రవాణా కమిషనర్ కె.సీతారామి రెడ్డి తెలిపారు. “కంట్లో ఇసుక..!” శీర్షికన ఒక పత్రికలో ప్రచురితమైన వార్తపై ఉప రవాణా కమిషనర్ స్పందిస్తూ ఈ ఆర్ధిక సంవత్సరంలో 167 గూడ్స్ వాహనాలపై టార్ఫాలిన్ లతో కప్పకపోవడం వలన కేసులు నమోదు చేసి రూ.4.62 లక్షలు, 115 గూడ్స్ వాహనాలపై ఓవర్లోడ్ కేసులు నమోదు చేసి రూ.62.58 లక్షలు అపరాధ రుసుము విధించడం జరిగిందని చెప్పారు. వాహన తనిఖీ అధికారులకు, సహాయ వాహనా తనిఖీ అధికారులకు నిరంతరం నిఘా కొనసాగించాలని, ఆదేశములను ఖచ్చితంగా అమలు చేయాలనీ స్పష్టం చేయడం జరిగిందని వివరించారు. టార్ఫాలిన్ తో కవర్ చేయని వాహనాలను నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు.