ఎల్.కోటకు సీఎం నారా చంద్రబాబు నాయుడు రాక
ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు ఎల్.కోట, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఎస్.కోట (ఎల్.కోట) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె వివాహం ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా విచ్చేసి వధువును ఆశీర్వదించనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని అధికారులు, పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు భద్రత మరియు ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్...