చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, 22 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రముఖ సినీ నటుడు, పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అభిమానులు, పార్టీ నాయకులు, ప్రజల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాధారణ కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టి తన కృషి, పట్టుదల, అంకితభావంతో దేశంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన...