BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 3:49 am Posted by : BHARATH PRATHINIDHI

బి‌జే‌పి ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు

గుంటూరు, 22 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బిజెపి ఏడవ మండలం 18 వ వార్డు బిజెపి కార్యదర్శి నారదాసు వీర మణింద్ర ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, దాక్షిణ్య విద్యాసంస్థలు చైర్మన్ డాక్టర్ టివి రావు, ప్రధాన కార్యదర్శి బజరంగ్ రామకృష్ణ, మిర్చి యార్డ్ డైరెక్టర్ మాజీ కార్పొరేటర్ కే.శ్రావణి కుమారి, బిజెపి బీసీ నాయకులు మేకల మాధవ యాదవ్, బిజెపి జిల్లా కార్యదర్శి నారాయణ రెడ్డి, గోపి సాంబశివరావు, సీనియర్ బిజెపి నాయకులు అప్పిశెట్టి రంగా, ఏడవ మండల అధ్యక్షులు బాబు, ఖర్జూరపు శీను తదితరులు పాల్గొని జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి ఇంకా మరెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలన్నారు. ఆయన పదిమందికి ఉపయోగపడే విధంగా మార్గదర్శిగా దిశా నిర్దేశం చేయాలని, యూత్ కి ఆయన ఎంతో స్ఫూర్తి అని కొని ఆడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి 18 వ వార్డులో కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ నాయకులు శ్రీను నాయక్, సాంబశివరావు, ఆపిల్ రేజేటి రమ్య తదితరులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.