నా కుటుంబాన్ని చంద్రబాబు – లోకేష్‌ మానసికంగా వేధించారు

రాజీవ్‌, మేఘన దంపతుల వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పందన ఇబ్రహీంపట్నం, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గత నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామని మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుటుంబంపై గత నెల రోజులుగా జరుగుతున్న ప్రచారం, తన కుమారుడు రాజీవ్‌, మేఘన...