లంచం కేసులో సీజీఎస్టీ సూపరింటెండెంట్ అరెస్ట్
విజయవాడలో రూ.50 వేల లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి విజయవాడ, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లంచం డిమాండ్ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్ బనోతు మంగమ్మను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అరెస్ట్ చేసింది. లంచం తీసుకుంటూ ఆమెను సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్న ఫిర్యాదుదారుడి నుంచి పన్ను బకాయిలకు సంబంధించి డిమాండ్ నోటీసు జారీ చేయకుండా, ఆ...