BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 5:30 pm Posted by : Raghunath Rolla

భక్తిశ్రద్ధలతో విశ్వ గురువు మహా ప్రవక్త జన్మదిన వేడుకలు

గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్వ గురువు మహా ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా రసూలుల్లా వారి జన్మదిన వేడుకలు కుదుబ్ షాహీ హజరత్ సయ్యద్ షా, మొహిద్దిన్ బాదుషా మౌలియా దర్గాలో బుధవారం జరగనున్నాయి. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి అల్ రసూల్ హజరత్ పీర్ సయ్యద్ షా సులేమాన్ కాబోలి అల్ కిలాలి సాహెబ్ మీడియా తో మాట్లాడారు. బుధవారం ఉదయం 9 గంటల నుండి మహమ్మద్ ప్రవక్త వారి నామస్మరణ స్మరిస్తూ హజరత్ మొహిద్దిన్ షా మోలియా దర్గా నుండి గొప్ప ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రజలకు శాంతి సందేశం ఇస్తూ కులమతాలకతీతంగా ప్రజలందరికీ ప్రసాదం పంచి పెడతామని అన్నారు. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో స్థానిక ముస్లిం పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.