BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 3:59 am Posted by : BHARATH PRATHINIDHI

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

దేవాలయంలో ప్రత్యేక పూజలు, కర్లపాలెంలో సంబరాలు

​పిట్టలవానిపాలెం / కర్లపాలెం: పద్మవిభూషణ్, సినీ నటుడు చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంలో జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
​పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి దేవాలయంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.


​ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మెగా యూత్ ఫోర్స్ సభ్యులు మనలి చైతన్య, జనసేన లీగల్ సెల్ సభ్యురాలు బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యురాలు జిడుగు విజయ మాధురి, పిట్టలవానిపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు హుస్సేన్ బేగ్, కర్లపాలెం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిలకలు సురేంద్ర, వీర మహిళ ఆగిశెట్టి నాగమల్లేశ్వరి పాల్గొన్నారు. ​వీరితో పాటు అభిమానులు ఆకుల నారాయణ, ఆగిశెట్టి శ్రీకాంత్, జిడుగు రాజేష్, గాజులు శ్రీనివాసరావు, చల్లపల్లి ఏసోబు, మనలి రవి కిషోర్ సహా పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు.