కులం కార్డు వెనుక అవినీతిని దాచలేరు ?

చట్టం ముందు తప్పు చేసినవారు శిక్షార్హులే : ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడారు. లిక్కర్ స్కామ్‌లో చట్టం తన పని తాను చేసుకుంటోంది...