BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 3:19 am Posted by : Raghunath Rolla

టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్‌కు బొండా ఉమా పరామర్శ

విజయవాడ, 29 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు పరుచూరి ప్రసాద్‌ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల పరుచూరి ప్రసాద్ కాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న బొండా ఉమా శనివారం ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ వివరాలతో పాటు ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. పార్టీకి, కార్మికుల సంక్షేమానికి నిరంతరం సేవలందిస్తున్న సీనియర్ నాయకులు పరుచూరి ప్రసాద్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీఎన్టీయూసీ ప్రతినిధులు ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొని పరుచూరి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.