BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 8:33 pm Posted by : BHARATH PRATHINIDHI

పేకాట (జూదం) స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి

పేకాటరాయళ్ల గుట్టు రట్టు.. భారీగా నగదు స్వాధీనం
29మంది జూదం రాయుళ్ళు అరెస్టు.. వాహనాలు, ఫోన్ స్వాధీనం

గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేకాట, జూదం, మాదక ద్రవ్యాల అమ్మకం, వాడకం, వంటి అసాంఘిక కార్య కలాపాలపై ఎస్పీ వకుల్ జిందాల్ ఉక్కుపాదం పెట్టాలని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపధ్యంలో గుంటూరు లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి నిర్వహించింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-1లో ఉన్న వైఫై గెస్ట్ హౌస్, 3వ అంతస్తు, రూమ్ నెం.304లో పేకాట నిర్వహిస్తున్నారన్న నిఘాడ సమాచారంతో గుంటూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట నిర్వహిస్తున్న 29 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 27 సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, రూ.23,77,120/- లు నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్న ఈశ్వరరావు (గుడివాడ), ఫణి (గుంటూరు) తో పాటు మొత్తం 29 మందిని విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.