BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 4:41 pm Posted by : BHARATH PRATHINIDHI

బండి సాహితీ రెడ్డి ట్రస్టు సేవలు స్ఫూర్తిదాయకం

గోల్కొండ హోటల్స్ అండ్ రిసార్ట్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి

గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తమ ఏకైక కుమార్తె సాహితీ రెడ్డి అకాల మరణం దుఃఖాన్ని దిగమింగి చిరకాలంగా తమకున్న దానిలో ఆమె జ్ఞాపకార్థం కోట్లాది రూపాయలు సమాజ హిత కార్యక్రమాలకు ఖర్చు చేయటం అశోక్ రెడ్డి సుధావాణి దంపతులు ఎంతోమందికి స్ఫూర్తిదాయకులని ప్రముఖ వ్యాపారవేత్త, హైదరాబాద్ గోల్కొండ హోటల్స్ అండ్ రిసార్ట్స్ చైర్మన్, సంఘ సేవకులు నడికట్టు రామిరెడ్డి పేర్కొన్నారు. బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక స్తంభాలగరువు రెడ్డి బాలికల వసతిగృహం బాలికల వసతిగృహం బండి సాహితీ రెడ్డి సమావేశ మందిరంలో కీర్తిశేషులు సాహితీ రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని పారిశ్రామికవేత్త రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సుధావాణి అశోక్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ సాహితీ చిన్న వయసు నుండే సమాజంలోని అనగారిన వర్గాల పట్ల ఆర్ద్రతగా ఉండేదని వారి కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉండేదని చెప్పారు. ఆమె జ్ఞాపకం గత పది సంవత్సరాలుగా రెడ్డి బాలుర బాలికల వసతి గృహానికి కావలసిన నిర్మాణాలు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, సమావేశ మందిరాలు వంటి సౌకర్యాలు కల్పించామని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం లక్షలాది రూపాయలు స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉడుముల కోటిరత్నం, ఉడుముల శ్రీనివాసరెడ్డి మాజీ కార్పొరేటర్ ఉడుముల లక్ష్మి, ఉడుముల శివారెడ్డి, భరత్ రెడ్డి, సంజీవరెడ్డి, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు