స్పెషల్ క్యాంపెయిన్ డేస్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఎన్నికల రోల్ పరిశీలకులు కూర్మనాథ్ గుంటూరు, 22 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో జరుగుతున్న స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో ప్రజల నుండి అందే ఫారాలను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎన్నికల రోల్ పరిశీలకులు కూర్మనాథ్ స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఉమెన్స్ కాలేజీ, టిజెపిఎస్ కాలేజీల్లోని పోలింగ్ కేంద్రాలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తో కలిసి ఆయన తనిఖీ...