ఫ్లాష్‌లైట్లతో ఏపీ జూడా నిరసన
12వ రోజు కొనసాగుతున్న ఏపీ జూడాల సమ్మె గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీ జూడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఫేజ్–3లో భాగంగా 5వ రోజు ఆందోళనలో గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన రెసిడెంట్ వైద్యులు, ఇంటర్న్‌లు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలో శాంతియుత నిరసన చేపట్టారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. సమస్యలపై ప్రభుత్వం అర్థవంతమైన చర్చలు జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. విజయవాడలో...