కాకాని దేవాలయంలో అమ్మవారి మంగళసూత్రం చోరీ
దొంగలను వెంటనే అరెస్టు చేయాలి: అంబటి మురళీకృష్ణ గుంటూరు, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పెదకాకాని శ్రీగంగా భ్రమరాంబ సమేత నుల్లేశ్వర స్వామి దేవాలయంలో ఆదిశక్తి అమ్మవారి మంగళసూత్రం అపహరణ ఘటనపై పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పవిత్ర శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అనంతరం అమ్మవారి మంగళసూత్రం కనిపించకుండా పోయిందని తెలిపారు. వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యే వరకు కూడా ఘటనపై కేసు నమోదు చేయకపోవడం దేవాలయ పాలకమండలి, పోలీసుల నిర్లక్ష్యానికి...