23 నుంచి పారదర్శకంగా ఏఈఈల నియామక పరీక్షలు

ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి గుంటూరు, 21 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12...