గుంటూరు లో అధునాతన “తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాలు పునః ప్రారంభం

గుంటూరు, 12 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏ తల్లీ ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అధునాతన "తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్" వాహనాలను ప్రవేశపెట్టిందని గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.బుధవారం గుంటూరు నగరంలోని జిజిహెచ్ ప్రాంగణంలో గల కానూరి జింఖానా శిశు మరియు స్త్రీ ఆరోగ్య కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మరియు వైద్య బృందంతో కలిసి మంత్రి కందుల...