ఏలేశ్వరంలో నాలుగు కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల అదనపు గదులు ప్రారంభం
ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ ఏలేశ్వరం/కాకినాడ, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలైన పీఎం ఉష నిధుల నుండి సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన అదనపు గదుల భవనాన్ని శుక్రవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్య ప్రభ మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి విద్యార్థిని, విద్యార్థులకు క్వాలిటీ విద్యను...