BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 2:22 am Posted by : Raghunath Rolla

ఏలేశ్వరంలో నాలుగు కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల అదనపు గదులు ప్రారంభం

ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ

ఏలేశ్వరం/కాకినాడ, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదలైన పీఎం ఉష నిధుల నుండి సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన అదనపు గదుల భవనాన్ని శుక్రవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్య ప్రభ మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి విద్యార్థిని, విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తాను ఎమ్మెల్యేగా నెగ్గిన రెండున్నర సంవత్సరాలలో ఈ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం తో పాటు నియోజవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సత్య ప్రభను కళాశాల యాజమాన్యం సన్మానించారు. అంతకుముందు డిగ్రీ కళాశాల మంజూరులో కృషి చేసిన నాయకులు, అధికారులకు కళాశాల ప్రిన్సిపల్ డి.సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఏ.పీ. ఈ. డబ్ల్యూ. ఐ. డి. సి. అధికారులు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.