నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో వీఎంసీ తనిఖీలు విజయవాడ, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అన్నపూర్ణ హెచ్చరించారు. నగరంలోని 39, 40, 41, 42వ శానిటరీ డివిజన్ల పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లపై శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు డాక్టర్‌ అన్నపూర్ణ పర్యవేక్షణలో శానిటరీ సూపర్‌వైజర్‌ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు...