తెలగమాంబ చెరువును అభివృద్ధికి చర్యలు

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువుని ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా తొలుత చెరువులోని జంగిల్ (పిచ్చి మొక్కల)ను వేగంగా క్లియర్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్లపాడులోని తెలగమాంబ చెరువు, రైల్వే స్టేషన్ రోడ్, మెయిన్ రోడ్ లో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా...