BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 2:39 am Posted by : Raghunath Rolla

షాధిక్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలి

బిజెపి గుంటుపల్లి మండల అధ్యక్షులు దుద్దుకూరి తిరుపతి నాయుడు

ఇబ్రహీంపట్నం, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లవ్ జిహాద్ నిందితుడు షాదిక్ కాన్ పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ గుంటుపల్లి మండల అధ్యక్షులు దుద్దుకూరి తిరుపతి నాయుడు భవానిపురం పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ అందించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాల మేరకు, గొల్లపూడి మండలం  ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా భవానిపురం పోలీసు స్టేషన్ లో కాకినాడ లో జరిగిన లవ్ జీహాద్ సంఘటన నిందితుడు షాదిక్ ఖాన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని , బాదితుల కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని కోరుతూ , రెప్రజెంటేషన్ ఇచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గొల్లపూడి మండలం అధ్యక్షులు దుద్దుకూరి తిరుపతి నాయుడు, ఎన్టీఆర్ జిల్లా ఐటీ కన్వీనర్ తుమ్మల శ్రీ కుమార్ , రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి చిగురు పాటి లక్ష్మి, గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాటమనేని చైతన్య మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.