గుంటూరు జిఎంసిలో ఏసీబీ దాడిలు
156 పనుల్లో అవకతవకలు గుర్తింపు గుంటూరు, 24 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో పది మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొని రికార్డులను పరిశీలించారు. ఏసీబీ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో నగరపాలక సంస్థలోని ఇతర విభాగాల అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. 2017 నుంచి 2025 వరకు జీఎంసీ పరిధిలో చేపట్టిన రహదారులు, డ్రైనేజీ కాలువలు,...