కాకినాడ బ్యూరో, 22 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాకినాడ జిల్లా సామర్లకోట బ్రౌన్ పేట, సుందర భవన్ బ్రాంచ్ కార్యాలయంలో సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ 4 వ మహోత్సవం ,యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొంగు సందీప్ రాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయగోదావరి జిల్లాల వ్యాప్తంగా తరలివచ్చిన న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు, ప్రింట్ మీడియా వ్యవస్థాపకులు, రిపోర్టర్లతో కార్యాలయంలో సందడి వాతావరణం కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ వ్యవస్థాపకులు కొంగు సందీప్ రాజు మాట్లాడుతూ జర్నలిస్ట్ వ్యవస్థలో విలేకరులందరూ సోదరా భావంగా ఉండాలని, ఒకరికొకరు సహకరించుకుంటూ సమైక్యంగా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి ఉండాలని తెలిపారు.

విలేకరులకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ తరపున మా అండదండలు ఎల్లప్పుడు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ సమావేశం అనంతరం విలేకరులు, నాయకులు, స్నేహితులు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగు. సందీప్ రాజ్ ను దుస్సాలువ, పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు, ప్రింటి మీడియా వ్యవస్థాపకులు, ఉమ్మడి గోదావరి జిల్లా బ్యూరోలు, జిల్లా స్టాపర్లు, రిపోర్టర్లు, రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షులు రాయుడు మోజెస్ బాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు రమణ, వైయస్సార్సీపి సామర్లకోట బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసు, ఆప్తులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించారు.