BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 4:42 am Posted by : BHARATH PRATHINIDHI

దేశంలో 140 కోట్ల మంది మానశిక క్షోభ లో ఉన్నారు ?

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్

గుంటూరు, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : దేశంలో 140 కోట్ల మంది మానశిక క్షోభ లో ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. అయితే దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు. సైలెంట్ రెవల్యూషన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. గుంటూరులో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ, అమిత్ షా మాత్రమే దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎలాంటి చదువు లేకుండా అబద్దాలతో పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో అన్నీ అవకతవకలు జరిగాయని, వెంటనే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నీట్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పారు. 30 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ను వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు కుటుంబాలు మాత్రమే పరిపాలన చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి ఏమి లేకపోగా 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని విమర్శించారు. కాపులు కాంగ్రెస్ పార్టీలో చేరితే ముఖ్యమంత్రిని చేస్తానని స్పష్టం చేశారు.