BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 6:25 am Posted by : Raghunath Rolla

సీఎం సార్.. మా డబ్బులు.. మాకు ఇవ్వండి

ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్

గుంటూరు, 31 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మా డబ్బులు.. మాకు ఇవ్వండి సీఎం సార్.. అంటూ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు సోమవారం గుంటూరులో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమం లో సీఎం సార్.. మా డబ్బులు.. మాకు ఇవ్వండి అంటూ నినాదాలు చేస్తు ఉద్యోగులు ర్యాలీ గా వచ్చి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం తమకు ఇవ్వవలసిన బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ జీతాల్లో ప్రభుత్వం వద్ద దాచుకున్న డబ్బులు మాత్రమే తాము అడుగుతున్నామని ఏపీ జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా ఛైర్మన్ కిరణ్ కుమార్ అన్నారు. కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకి రావాల్సిన పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. కొందరు మంత్రులు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులను రెచ్చగొడుతుందని మాట్లాడడం సరైన విధానం కాదన్నారు.