BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 3:03 am Posted by : BHARATH PRATHINIDHI

వీధి వ్యాపారి నుంచి డాక్టరేట్ వరకు.. చరక కుమార్ అరుదైన విజయం

గుంటూరు నగర వీధి వ్యాపారుల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై పరిశోధనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ

గుంటూరు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వీధి వ్యాపారిగా జీవనోపాధి కొనసాగిస్తూనే ఉన్నత విద్యపై అంకితభావంతో పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసిన చరక కుమార్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్క్ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టా పొందారు. “ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలోని వీధి వ్యాపారుల సామాజిక-ఆర్థిక పరిస్థితులు: ఒక అధ్యయనం” అనే అంశంపై నిర్వహించిన తన పరిశోధనను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సోషియాలజీ & సోషల్ వర్క్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎం. త్రిమూర్తి పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తి చేశారు. విశ్వవిద్యాలయ రీసెర్చ్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ చరక కుమార్‌కు పీహెచ్‌డీ మంజూరైనట్లు అధికారికంగా ప్రకటించారు. వీధి వ్యాపారిగా కష్టపడి జీవనోపాధి కొనసాగిస్తూనే విద్యను అభ్యసించి అత్యున్నత విద్యార్హతను సాధించడం ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ విజయం వీధి వ్యాపారులు, శ్రమజీవులు మరియు యువతకు, పరిశోధక విద్యార్థుల కు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్,ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ గంగాధర్ మరియు విద్యార్థులు, అభినందనలు తెలియచేశారు.