విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఎమ్మెల్యే గళ్ళా మాధవి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన గుంటూరు, 28 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ జిల్లా పరిషత్ ఆవరణలో రూ.6.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ ఇండోర్ పవర్ సబ్‌స్టేషన్‌కు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. దీనివలన 12 వేల గృహాల విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు నగరంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో...