లాయర్ ఇంట్లో చోరీ.. భార్యను కట్టేసి..!

ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముసుగు ధరించిన నలుగురు దొంగలు ఒక లాయర్ ఇంట్లోకి చొరబడి రూ.3.15 కోట్ల విలువైన నగలు, డబ్బుతో ఉడాయించారు. కురుక్షేత్రలో గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడు, సీనియర్ అడ్వొకేట్ బల్వంత్ సింగ్ వాలియా థానేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం, గురువారం రాత్రి పెంపుడు శునకంతో కలిసి బయటకు వెళ్లిన ఆయన 9.30 గంటలకు తిరిగొచ్చేసరికి ఇంట్లో షాకింగ్ దృశ్యం...