రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

సికింద్రాబాద్, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజమహేంద్రవరంలో కారుతో యువకులు మద్యం మత్తులో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. ఉద్దేశ పూర్వకంగానే ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజులుగా కిమ్స్‌లో ప్రియాంకకు వైద్యులు చికిత్స అందించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోనే ప్రియాంక మృతదేహాన్ని ఉంచారు. రాజమండ్రి...