BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 1:45 pm Posted by : BHARATH PRATHINIDHI

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

సికింద్రాబాద్, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాజమహేంద్రవరంలో కారుతో యువకులు మద్యం మత్తులో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. ఉద్దేశ పూర్వకంగానే ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజులుగా కిమ్స్‌లో ప్రియాంకకు వైద్యులు చికిత్స అందించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోనే ప్రియాంక మృతదేహాన్ని ఉంచారు. రాజమండ్రి పోలీసులు వచ్చిన తర్వాత ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆస్పత్రికి ప్రియాంక మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమండ్రిలో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఉన్నారు. ఆమె నాన్న వచ్చిన తర్వాత పోస్టుమార్టానికి పోలీసులు తరలించనున్నారు. ఈ ఘటనపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.