BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 4:31 am Posted by : BHARATH PRATHINIDHI

రమణయ్యపేటలో అక్రమ బార్ భవనం సీజ్

కాకినాడ బ్యూరో, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బార్ అండ్ రెస్టారెంట్ భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీల అనంతరం సీజ్ చేయించారు. భవనానికి సంబంధించిన బార్ బోర్డులను తొలగించి షట్టర్లకు అధికారిక సీల్ వేశారు. భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు, సెట్‌బ్యాక్ నిబంధనలు, కుడా డెవలప్‌మెంట్ ఛార్జీల చెల్లింపుల్లో ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే లైసెన్స్ మంజూరు విషయాలపై ఆరా తీశారు.