యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

భువనగిరి డీఎస్పీ రవీందర్‌యాదవ్‌ భువనగిరి, భారత్ ప్రతినిధి న్యూస్ : యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్‌యాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో 2కే రన్‌ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్‌ వంటి అలవాట్లకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అన్నారు. యువత విద్యపై దృష్టి సాధించి ఉన్నత చదువులు అభ్యసిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో...