BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 2:40 pm Posted by : BHARATH PRATHINIDHI

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

భువనగిరి డీఎస్పీ రవీందర్‌యాదవ్‌

భువనగిరి, భారత్ ప్రతినిధి న్యూస్ : యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్‌యాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో 2కే రన్‌ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్‌ వంటి అలవాట్లకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అన్నారు. యువత విద్యపై దృష్టి సాధించి ఉన్నత చదువులు అభ్యసిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌, భువనగిరి పట్టణ సీఐ రమేష్‌, ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్య, మాజీ కౌన్సిలర్‌ ఈరపాక నరసింహ, డీసీసీ కార్యదర్శి మజార్‌ బాయ్‌, బట్టు సందీప్‌, రమేష్‌, సన్నీ, మసూజ్‌, నితీష్‌, సాయిచరణ్‌, జలీల్‌, అబేద్‌ తదితరులుపాల్గొన్నారు.