మధ్యవర్తిత్వంతో వివాదాలకు శాశ్వత పరిష్కారం
పెదకూరపాడులో ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కార్యక్రమం పెదకూరపాడు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వి.విజయకుమార్ రెడ్డి సూచనలతో పల్నాడు జిల్లా పెదకూరపాడులో గురువారం మధ్యవర్తిత్వం (Mediation), రాజీమార్గం మరియు ఉచిత న్యాయ సహాయం అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ...