గుంటూరు, 19 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేసి, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ఏఐవైఎఫ్ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ వలి తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చి సంకలు కొట్ఠుకుంటున్నారని ఎద్దేవా చేశారు.వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జంగాల చైతన్య,బి.యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.