మంచుకొండల నుంచి.. సరిహద్దు గ్రామాల్లోకి..!
శ్రీనగర్ నుంచి లద్ధాఖ్, మనాలీ మీదుగా అమృతసర్ వరకు 13 రోజుల ప్రయాణం. భావసారూప్యత కలిగిన మిత్రులం పదిమందిమి కలిసి ఈ సుదీర్ఘ ప్రయాణం హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీనగర్ విమానాశ్రయంలో దిగగానే నేరుగా పహల్గాం లోయకు రాత్రి బస అక్కడే. 2వ రోజు పహల్గాం లోయ సందర్శన. 7200 అడుగుల ఎత్తులో ఉండే ఈ లోయ గుండా ‘లిడ్డర్’ నది ప్రవహిస్తుంది. అక్కడ ఎక్కువగా సినిమా షూటింగులు జరుగుతాయి. సన్నీ డియోల్ ‘బేతాబ్’ సినిమా తీసిన స్థలాన్ని ‘బేతాబ్ లోయ’గా పిలుస్తారు. ఇక్కడి...